నేటి యువతరం గుర్తింపును కోరుకుంటోంది. ఆ క్రమంలో వినూత్నమైన ప్రయోగాలు చేయడానికి యువకులు పూనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని అనే యువకుడు ఇంటర్ పూర్తిచేసి సొంత ఊరిలో చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. తన సమోసాలకు గిరాకీ పెంచుకునేందుకు ఏం చేయాలా? అని ఆలోచించిన రితేశ్ సోనీకి 'పెద్ద సమోసా' ఐడియా తట్టింది.
వెంటనే సమోసాల చరిత్రపై ఇంటర్నెట్ వెతకగా, ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాళాశాల విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసా ఇప్పటివరకు గిన్నిస్ రికార్డులకెక్కిన అతిపెద్ద సమోసా అని తెలుసుకున్నాడు. దీంతో అంతకంటే పెద్ద సమోసాను తయారు చేసి, గిన్నిస్ రికార్డులకెక్కడంతో పాటు 'పెద్ద సమోసా దుకాణం'గా తన దుకాణానికి పేరు తీసుకురావాలని భావించాడు.
దీంతో స్నేహితుల సాయంతో గిన్నిస్ రికార్డు ప్రయత్నం ప్రారంభించాడు. ఇందుకోసం 90 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాళ్ల గోధుమ పిండి, రెండు క్వింటాల బంగాళాదుంపలు ఉపయోగించి, 3 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల మందం కలిగిన 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు.
దీనిని తయారు చేసేందుకు 40 వేల రూాపాయలు ఖర్చయ్యాయని రితేశ్ తెలిపాడు. అయితే దీనిపై గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని, తమ సమోసా 'ప్రపంచంలోనే అతిపెద్ద సమోసగా' గుర్తింపు పొందుతుందని రితేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
More Telugu News
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?
-
ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత
-
మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అదరగొట్టాడు.. అతనికి ఆ ఫార్మాట్లో కూడా అవకాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్
-
సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్లైన్లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు
-
సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ
-
యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!
-
టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన
-
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం
-
ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయణ' మెలోడీ
-
ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి