Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమికి దగ్గరగా రానున్న శనిగ్రహం

ఇవాళ (ఆదివారం) సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు దిక్కుగా చూడండి.. వాతావరణం కూడా సరిగా అనుకూలిస్తే బాగా ప్రకాశవంతమైన నక్షత్రం ఒకటి కనిపిస్తుంది. నిజానికి అది నక్షత్రం కాదు.. శనిగ్రహం. సూర్యుడి చుట్టూ చేసే పరిభ్రమణాల్లో భాగంగా ఆదివారం నాడు భూమికి అత్యంత సమీపానికి శనిగ్రహం వస్తుంది. మన కంటితో చూసేందుకు అందుబాటు దూరంలోకి వస్తుందన్నమాట.

సాధారణంగా ఏడాదికోసారి శనిగ్రహం భూమికి దగ్గరగా వస్తుంటుంది కానీ.. ఈ ఏడాది చాలా దగ్గరకు వస్తోందని.. మహారాష్ట్రలోని ఆకాశ్‌గంగ ఖగోళ పరిశోధన కేంద్రం చీఫ్‌ భరత్‌ ఆదూర్‌ చెప్పారు. మళ్లీ ఇంత దగ్గరగా రావాలంటే దశాబ్దం పడుతుందిట. మామూలుగా భూమినుంచి 165 కోట్ల కిమీల దూరంలో ఉండే శని ఇవాళ 132.20 కోట్ల కిమీల దూరానికి వస్తుంది. నిజానికి ప్రతి 378 రోజుకోసారి సూర్యుడు, భూమి, శని ఒకే సరళరేఖలోకి వస్తాయి. దీనినే శాటర్న్‌ అపోజిషన్‌ అంటారు.

ఆదివారం సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిక్కున మామూలుగా మన కంటికి నక్షత్రంలాగా ఇది కనిపిస్తుందిట. బైనాక్యులర్స్‌తో చూస్తే దానిచుట్టూ వలయాలు కూడా కనిపిస్తాయిట. సోమవారం ఉదయం పడమటి దిక్కున కూడా ఇది కనిపిస్తుందిట. శని ఉపగ్రహాలు కూడా కనిపించే ఛాన్సుందంటున్నారు.

More Telugu News