మరోసారి వణికిన బంగ్లాదేశ్... రంజాన్ ప్రార్థనలు జరిగే ప్రాంతంలో పేలుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి వణికిన బంగ్లాదేశ్... రంజాన్ ప్రార్థనలు జరిగే ప్రాంతంలో పేలుడు

బంగ్లాదేశ్ లో మరో ఉగ్రదాడి జరిగింది. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతంలో ఉగ్రవాదులు శక్తిమంతమైన బాంబులు పేల్చారు. కిషోర్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించగా, ఒక పోలీసు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. దాడిలో పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.

More Telugu News