ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’!... కేజ్రీ సర్కారు ఇఫ్తార్ కు నజీబ్, బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’!... కేజ్రీ సర్కారు ఇఫ్తార్ కు నజీబ్, బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెప్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య పొడచూపిన విభేదాలు సద్దుమణిగాయని... ప్రస్తుత పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’గానే ఉందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇందుకు నిదర్శనంగా నిన్న ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని ఆప్ సర్కారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు నజీబ్ డుమ్మా కొట్టారు. నజీబ్ తో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విజేంద్ర గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విందుకు గైర్హాజరయ్యారు. గతేడాది ఆప్ సర్కారు ఏర్పాటు చేసిన ఇప్తార్ కు అందరికంటే ముందు వచ్చిన జంగ్... ఈ దఫా ఆ దరిదాపుల్లోకే రాలేదు. దీనిపై స్పందించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇఫ్తార్ కు వారు తప్పనిసరిగా రావాల్సి ఉంది. వారిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానం పలికాం. గైర్హాజరీకి కారణం వారే చెప్పాలి. వ్యక్తిగత కారణాలతోనే వారు హాజరుకాలేదని మేము అనుకుంటున్నాం’’ అని సిసోడియా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి పరిస్థితి ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’గానే ఉందని జాతీయ మీడియా కథనాలు రాసింది.

More Telugu News