హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ పేల్చివేతకు ఉగ్రవాదుల కుట్ర
హైదరాబాద్ లో ఓ పోలీస్ స్టేషన్ ను, నగరంలోని పలు ఆలయాలను శక్తిమంతమైన బాంబులతో కూల్చివేయాలని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో వెల్లడైంది. నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు విచారించినప్పుడు పలు విషయాలు వెల్లడయ్యాయి. కాగా, అరెస్టు చేసిన ఉగ్రవాదులను ఈ రోజు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. ఉగ్రవాదులకు 15 రోజుల పోలీస్ కస్టడీ కోరనున్నట్లు సమాచారం.