టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి చివరి దాకా పోటీ పడ్డట్టు వచ్చిన వార్తల్లో పస లేదని తేలిపోయింది. కుంబ్లేను నిలువరించి అతడితో హోరాహోరీగా పోటీకి దిగిన క్రికెటర్ వేరే ఉన్నారని ఓ తాజా కథనం వెలుగులోకి వచ్చింది. రవిశాస్త్రి కంటే మెరుగైన ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా కుంబ్లే కంటే కూడా మెరుగైన మార్కులే వేయించుకున్న సదరు మాజీ క్రికెటర్... ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీగా తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ పదవికి కొందరు విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే అయినా... వారిలో టామ్ మూడీ ఉన్నట్లు చాలా మందికి తెలియలేదు. ఇంటర్వ్యూలో భాగంగా కోచ్ గా తనకున్న అనుభవాన్ని సమగ్రంగా వివరించిన మూడీ... క్రికెట్ అడ్వైజరీ కమిటీని మెప్పించాడట. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న అతడి అనుభవం కూడా కమిటీని ఆకట్టుకుంది. ఈ క్రమంలో కుంబ్లే కంటే కూడా మూడీ వైపే కోచ్ పదవి మొగ్గింది. అయితే చివరాఖరుకు దేశీయ స్పిన్ దిగ్గజం కుంబ్లేనే హెడ్ కోచ్ గా ఎంపిక చేసిన బీసీసీఐ మూడీకి మాత్రం మొండిచేయి చూపింది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు