దేవుడి విషయంలో సహకరించకపోతే వారి కర్మ వారే అనుభవిస్తారు: సినీనటుడు మోహన్ బాబు
దేవుడి విషయంలో సహకరించకపోవతే వారి కర్మ వారే అనుభవిస్తారని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ముసిలిపేడు సమీపంలోని కొండల్లో ఉన్న బత్తినయ్య స్వామిని మోహన్ బాబు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి పాదాల వద్ద పూజలు చేశారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ, కొండపై అభివృద్ధి పనులకు అటవీశాఖ అడ్డంకులు సృష్టించడం సబబుకాదని, దేవుడి విషయంలో సహకరించకపోతే వారి కర్మ వారే అనుభవిస్తారని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి తాను చేస్తానని మోహన్ బాబు చెప్పారు. అంతకుముందు, ముసిలిపేడు గ్రామస్తులు మోహన్ బాబు దంపతులకు ఘన స్వాగతం పలికి గ్రామంలోకి ఆహ్వానించారు.