నా మేనిపై ఉన్న టాటూలెన్ని?... ఫ్యాన్స్ కు ప్రశ్న వేసి తానే ఆన్సర్ చెప్పిన కోహ్లీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా మేనిపై ఉన్న టాటూలెన్ని?... ఫ్యాన్స్ కు ప్రశ్న వేసి తానే ఆన్సర్ చెప్పిన కోహ్లీ!

టీమిండియా చిచ్చర పిడుగు, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా ప్రత్యేకమే. సరికొత్త హెయిర్ కట్ తో ప్రత్యక్షమైన అతడికి నానాటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. జింబాబ్వే టూర్ కు వెళ్లని అతడికి కాస్తంత విశ్రాంతి లభించింది. ఈ స్వల్ప కాలం విశ్రాంతిని వెరైటీగా మలచుకునే క్రమంలో అతడు పలు నగరాల్లో పర్యటిస్తున్నాడు. గత వారం ఎంపిక చేసిన 35 మంది ఫ్యాన్స్ తో అతడు గుర్ గావ్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా తన గురించి ఎవరికి ఎక్కువ తెలుసన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు అతడు ఫ్యాన్స్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇందులో భాగంగా అసలు తన మేనిపై ఉన్న టాటూలు ఎన్ని? అంటూ ఆశ్చర్యకరమైన ప్రశ్న సంధించాడు. కోహ్లీ ఎడమ చేతి నిండా టాటూలు కనిపిస్తాయి. అయితే అవి ఎన్ని? అని అడిగితే మాత్రం మనం చెప్పలేం. అతడితో గుర్ గావ్ లో భేటీ అయ్యే అవకాశం చిక్కిన ఫ్యాన్స్ కూడా చెప్పలేకపోయారు. దీంతో తాను వేసిన ప్రశ్నకు కోహ్లీనే ఆన్సర్ ఇచ్చేశాడు. ప్రస్తుతం తన చేతిపై 8 టాటూలు ఉన్నాయని చెప్పిన కోహ్లీ... వాటి సంఖ్యను త్వరలోనే 3 గా మార్చేస్తానని చెప్పాడు. 8 టాటూలను మూడుగా మార్చేస్తాడంటే వాటిలోని ఐదింటిని చెరిపేస్తాడని కాదట. వాటిలోనే కొన్ని సవరణలు చేసి ఎనిమిదింటిని మూడుగా మార్చేస్తాడట.

More Telugu News