తాను చనిపోతూ మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చాడో 17 ఏళ్ల విద్యార్థి. ఇప్పుడు వారిలోనే తమ కుమారుడిని చూసుకుంటున్నారా తల్లిదండ్రులు. ముంబైకి చెందిన భావేష్ డిగ్గే విద్యావిహార్లోని కేజే సోమైయ కాలేజ్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. గతవారం కాలేజ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్నేహితులతో కలిసి వాడలా స్టేషన్లో రైలు ఎక్కి ఇంటికి బయలుదేరాడు. అయితే రైలులో విపరీతమైన రద్దీ కారణంగా పట్టుతప్పిన భావేష్ వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల తర్వాత అతను బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇక చేసేదేమీ లేదని పేర్కొన్నారు.
అయితే అతని అవయవాలను దానం ఇవ్వడం ద్వారా మరికొందరికి పునర్జన్మ ఇవ్వవచ్చని, తద్వారా కొడుకు బతికే ఉంటాడని భావేష్ కుటుంబ సభ్యులకు వైద్యులు వివరించారు. దీనికి వారు అంగీకరించడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న ఆరుగురికి ట్రాన్స్‌ప్లాంట్ చేసి భావేష్ అవయవాలను అమర్చారు. 31 ఏళ్ల మహిళకు గుండెను, లివర్‌ను 76 ఏళ్ల వృద్ధుడికి, ఓ కిడ్నీని 29 ఏళ్ల మహిళకు, మరోదానిని 42 ఏళ్ల మహిళకు అమర్చారు. అలాగే కార్నియాలను మరో ఇద్దరికి అమర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. బంగారు భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా దూరమవుతాడని ఊహించలేదని, ఇప్పుడు ఆరుగురిలో తమ కుమారుడిని చూసుకుంటున్నామని భావేష్ తల్లిదండ్రులు కన్నీరు సుడుల మధ్య పేర్కొన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు