బాలికలను కాపాడుకోవడంతోపాటు వారికి విద్యనందించే ఉద్దేశంతో గతేడాది ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ఐడియా తనదేనని, కేంద్రం దానిని కొట్టేసిందని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వం ఈ స్లోగన్‌ను ఎక్కడి నుంచి తీసుకుందో చెప్పాలంటూ ఉదయ్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో చేతనా భాటి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె ప్రధాని మోదీకి తన ప్రతిభను గుర్తించాలని కోరుతూ లేఖ రాశారు.
హిస్టరీ, ఇంగ్లిష్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన భాటి, 20 ఏళ్ల క్రితం పోలీస్ ఫోర్సులో చేరకముందు ప్రభుత్వ స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. ‘‘1999లో ఓ కవిత్వం కోసం ఈ పదబంధాన్ని మొట్టమొదట రాశా. 2005లో జరిగిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించా కూడా. డబ్బుల కోసమో, పేరు కోసమో ఇప్పుడు నేనీ పనిచేయడం లేదు. ఎంతో పాప్యులర్ అయిన ఈ స్లోగన్ ఐడియా నాదే అని చెబితే చాలు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మోదీ స్పందిస్తారనే అనుకుంటున్నానని భాటీ ఆశాభావం వ్యక్తం చేశారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు