మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీ ఫోన్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. 'గాడ్ లెస్' అనే ప్రమాదకరమైన మాల్ వేర్ పడగవిప్పుకుని ఉంది. ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో ఫోన్ లోకి వచ్చి చేరే ఈ వైరస్, ఇండియాలోని 46.19 శాతం ఫోన్లపై ప్రభావం చూపిస్తోందని జపాన్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ ట్రెండ్ మైక్రో వెల్లడించింది.
ఈ వైరస్ వచ్చిన తరువాత వాడకందారు ప్రమేయం లేకుండా యాప్స్ డౌన్ లోడ్ అయిపోతాయని, ఆపై ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చేతుల్లోకి వెళుతుందని, ఇప్పటివరకూ 8.5 లక్షల స్మార్ట్ ఫోన్లలోకి ఈ వైరస్ చేరిందని ట్రెండ్ మైక్రో పరిశోధకులు తెలిపారు. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వర్షన్ కన్నా ముందున్న వర్షన్లపై ఈ వైరస్ దాడి చేస్తోందని, ఇండియా తరువాత ఇండొనేషియా, థాయ్ ల్యాండ్‌లపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు.
దీని బారి నుంచి ఫోన్ ను కాపాడుకోవాలంటే, యాప్స్ అన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో రివ్యూలను పరిశీలించిన తరువాత మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని, వాటి అప్ డేట్స్ కూడా అక్కడి నుంచే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ కు మారిపోవాలని, యాంటీవైరస్ ఉండాలని సూచిస్తున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు