ఒక ఊరి నుంచి మరో ఊరికి పోయిరావాలంటేనే వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వుంటుంది. అదే ఇక మరో దేశానికి వెళ్లి ఖరీదైన హోటళ్లలో ఉండి, విమానాల్లో తిరుగుతూ, షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయాలంటే... లక్షలు ఖర్చయిపోతాయి. కానీ, 30 సంవత్సరాల నటాలీ వుడ్ అనే బ్రిటన్ భామ రూపాయి ఖర్చు చేయకుండా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతోంది. ఎలాగంటారా? పోయిన ప్రతి చోటా 'మిస్ ట్రావెల్' డేటింగ్ వెబ్ సైట్ లో ఓ ధనవంతుడిని తోడుగా చేసుకుంటూ ఉండటమే.
ఇప్పటివరకూ టర్కీ, అబూదాబీ, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలు తిరిగిన నటాలీ ప్రస్తుతం మియామీలో ఉంది. తాను ఇప్పటివరకూ 80 మందితో డేటింగ్ చేశానని, దేశాలన్నీ తిరిగి రావాలన్న కోరికతో పాటు ఓ మంచి భర్తను వెతుక్కోవడమే తన లక్ష్యమని చెబుతోంది. తన డేటింగ్ టూర్ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, సంపన్న పురుషులు తన అందానికి ఇట్టే పడిపోతున్నారని, ఇక వారితో స్వల్పకాల లైంగిక బంధం తనకు ఇబ్బందేమీ కావడం లేదని చెబుతోంది.
ఇప్పటివరకూ దాదాపు కోటి రూపాయలకు పైగా తన కోసం డేటింగ్ ఫ్రెండ్స్ ఖర్చు చేసి వుండవచ్చని నటాలీ అంది. కువైట్ లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్, ఆస్ట్రేలియాలో ఎన్నో సొంత విమానాలున్న బిలియనీర్ ను కలవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. మియామీలో తనను కలవాల్సిన వ్యాపారవేత్త, పనిమీద లండన్ వెళ్లిపోయాడని, ఇక్కడి నుంచి మరో దేశం వెళ్లేందుకు 'మిస్ ట్రావెల్' సైట్ ను వెతుకుతున్నానని చెబుతోందీ ముద్దుగుమ్మ.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు