భారత్, చైనా సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో సైనిక అవసరాలను తీర్చేలా 145 తేలికపాటి హోవిట్జర్ గన్స్ ను అమెరికా నుంచి ఇండియా కొనుగోలు చేసింది. వీటిని హెలికాప్టర్లలో సైతం సులువుగా తరలించవచ్చని, తేలికగా ఉండి, శత్రువులపై నిప్పులు కురిపిస్తాయని అధికారులు వివరించారు. ఈ డీల్ కు సంబంధించి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని, దీని విలువ 750 మిలియన్ డాలర్లని అధికారులు తెలిపారు.
భారత్ కు సంబంధించినంత వరకూ పర్వతాల్లో యుద్ధం కోసం ఆయుధాల కొనుగోలులో ఇదే అతిపెద్ద డీల్ గా వెల్లడించారు. అమెరికా గన్ తయారీ సంస్థ బీఏఈ వీటిని అందిస్తుందని వివరించారు. తొలుత వాడకానికి సిద్ధంగా ఉన్న 25 గన్స్ ను బీఏఈ అందిస్తుందని, మిగిలినవి మహీంద్రా ప్లాంటులో విడిభాగాలను అతికించి తయారు చేస్తామని వెల్లడించారు. 1987 నుంచి వాడకంలో ఉన్న బోఫోర్స్ గన్స్ ను హోవిట్జర్లతో రీప్లేస్ చేయనున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు ధనుష్ పేరిట తయారు చేస్తున్న 155 ఎంఎం 45 కాలిబర్ గన్స్ నెలాఖరు నుంచి సైన్యం అమ్ములపొదిలోకి చేరనున్నాయని వెల్లడించారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు