అంతా రైతుల ఇష్టమే!.. మల్లన్నసాగర్ భూసేకరణపై కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ సేకరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. భూసేకరణ విషయంలో రైతుల ఇష్టానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. భూసేకరణకు ప్రస్తుతం రెండు రకాల చట్టాలు (2013 భూసేకరణ చట్టం, జీవో నెంబర్:123) అందుబాటులో ఉన్నాయని చెప్పిన కేసీఆర్... వాటిలో రైతులు దేనికి ఓటేస్తారో, దాని ప్రకారమే భూములను సేకరిస్తామని, ఆ చట్టాలకు అనుగుణంగానే పరిహారం చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో నిర్ణయాధికారం రైతులకే వదిలేస్తున్నట్లు ప్రకటించిన ఆయన... దీనిపై రాజకీయం చేసేందుకు రంగంలోకి దిగిన విపక్షాలకు షాకిచ్చారు.