తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా మాట్లాడుతోందో మనకు తెలుసు: చ‌ంద్ర‌బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా మాట్లాడుతోందో మనకు తెలుసు: చ‌ంద్ర‌బాబు

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతుల‌కు తుళ్లూరులో ఈరోజు ప్లాట్ల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... ‘విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు మనకు ఇంకా అంద‌లేదు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో నెత్తిన అప్పుతో ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఓ ప‌క్క తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా మాట్లాడుతోందో మ‌న‌కి తెలుసు. రాజ‌ధాని ఎంపిక‌పై కూడా ప‌లువురు రాద్ధాంతం చేశారు. ఆర్థికంగా ప‌రిస్థితులు బాగోలేవు. అయినా అన్నిటినీ త‌ట్టుకొని ముందుకెళుతున్నాం’ అని ఆయ‌న అన్నారు. విజ‌య‌వాడ‌-గుంటూరు మ‌ధ్య రాజ‌ధాని ఉంటుంద‌ని చెప్పానని, రాజ‌ధాని ఇక్క‌డ వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదన్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత‌ రెండు నెల‌ల్లోనే రాజ‌ధాని కోసం భూసేక‌ర‌ణ పూర్తి చేశామ‌ని చంద్రబాబు అన్నారు. ప్ర‌జ‌లిచ్చిన‌ స‌హ‌కారం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనని ఆయ‌న అన్నారు. ‘పొట్టి శ్రీ‌రాములు తెలుగు వారికి ఓ రాష్ట్రం కావాల‌ని పోరాటం చేశారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఆనాడు క‌ర్నూలు వ‌చ్చాం. ఆ త‌రువాత‌ హైద‌రాబాద్ రాజ‌ధానిగా నిలిచింది. 60 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క‌ట్టుబ‌ట్ట‌ల‌తో కొత్త ప్రాంతానికి వ‌చ్చే ప‌రిస్థితి మ‌న‌కు వ‌చ్చింది. ధైర్యంగా ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని ఆయ‌న పిలుపునిచ్చారు.

More Telugu News