తెలుగు నేల రెండేళ్ల క్రితం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ రెండుగా విడిపోక తప్పలేదు. ఈ నెల 27 నాటికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు సహా, అన్ని కమిషనరేట్లు కూడా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిసరాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే చాలా శాఖలు అమరావతికి వెళ్లిపోగా, ఈ నెల 27న ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ కూడా అమరావతికి తన కార్యాలయాన్ని మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్కిల్ కూడా రెండుగా విడిపోనుంది. రాష్ట్రం రెండుగా విడిపోయినా... రెండేళ్లుగా టెలికాం సర్కిల్ మాత్రం ఒక్కటిగానే కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే వచ్చే నెల 1 నుంచి టెలికాం సర్కిల్ రెండుగా విడిపోనుంది. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ‘ఉమ్మడి’గా ఉన్న టెలికాం సర్కిల్ లో 19 వేల నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, 6 వేల దాకా ఎగ్జిక్యూటివ్ సిబ్బంది పనిచేస్తున్నారు. టెలికాం సర్కిల్ రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ టెలికాం సర్కిల్ హైదరాబాదులోనే కొనసాగనుండగా, ఏపీ టెలికాం సర్కిల్ మాత్రం కొత్తగా విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. విభజన జరిగిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది... ఏ జిల్లాలో పనిచేస్తున్న వారు ఆ జిల్లాలోనే ఉండిపోతారు. ఎగ్జిక్యూటివ్ సిబ్బందిని మాత్రం వారు ఇచ్చే ‘ఆప్షన్’ల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ అవుతారు. ఇక టెలికాం సర్కిల్ రెండుగా విడిపోయినా... వీటి మధ్య రోమింగ్ మాత్రం ఉండదని ఆ శాఖ ప్రకటించింది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు