ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాట్స్ యాప్... విచారించనున్న సుప్రీంకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాట్స్ యాప్... విచారించనున్న సుప్రీంకోర్టు

సామాజిక మాధ్యమాల్లో పాప్యులర్ అయిన వాట్స్ యాప్, వైబర్ వంటి యాప్స్ ఉగ్రవాదులకు ఉపకరిస్తున్నాయని, వారి మధ్య ఈ తరహా యాప్స్ ద్వారా నిత్యమూ సంభాషణలు జరుగుతున్నందున వాటిని నిషేధించాలని హర్యానా స.హ. కార్యకర్త సుధీర్ యాదవ్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తమ యాప్స్ ద్వారా బట్వాడా అయ్యే సమాచారాన్ని ఈ యాప్స్ పూర్తి రక్షణాత్మకంగా చేశాయని, నిఘా సంస్థలు వాటిని కనిపెట్టలేని విధంగా తయారు చేశాయని, ఆరోపిస్తూ, దీని వల్ల దేశ భద్రతకు విఘాతం వాటిల్లే సూచనలు ఉన్నాయని అన్నారు. వాట్స్ యాప్ తో పాటే హైక్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటివి కూడా దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కనిపిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను 29వ తేదీన పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

More Telugu News