సనాతన ముస్లిం సంప్రదాయాలను కఠినంగా అమలు చేసే దుబాయ్, తొలిసారిగా రంజాన్ నిబంధనలను సరళీకరించింది. టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయం, ఆల్కహాల్ పన్ను రూపంలో వచ్చే డబ్బును వదులుకోలేని దుబాయ్, రంజాన్ సమయంలో అమలయ్యే మద్య నిషేధాన్ని తొలగించింది. దుబాయ్ చరిత్రలో రంజాన్ సందర్భంగా పగటిపూట మద్యాన్ని అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ విదేశీయులైనా, స్వదేశీయులైనా రంజాన్ సమయంలో దుబాయ్ లో చేతిలోకి బీరు గ్లాస్ తీసుకోవాలంటే, సూర్యుడు పడమటి పొద్దుకు వాలేంత వరకూ ఆగాల్సిందే.
ఇక ఈ సంవత్సరం దుబాయ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ నుంచి ఎమిరేట్స్ లోని అన్ని బార్లు, నైట్ క్లబ్బులకు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకూ మద్యం అమ్మకాలను అనుమతిస్తున్నట్టు సర్క్యులర్ పంపింది. తమ దేశానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా, వారు కోరుకునే అనుభూతిని అందించేందుకే ఈ నిబంధనల మార్పు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏ సమయంలోనైనా టూరిస్టులు వచ్చే వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ గా దుబాయ్ ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించింది.
కాగా, ఈ రంజాన్ సీజనులో షాపింగ్ నిమిత్తం 10 లక్షల మంది వరకూ దుబాయ్ వస్తారని అంచనా. అయితే, ఇక్కడికి వచ్చే అతిథులు అరబ్ సంస్కృతి, సంప్రదాయాలను మనసులో పెట్టుకుని మెలగాలని ప్రభుత్వం సూచించింది. దుబాయ్ లో మద్యంపై 30 శాతం మునిసిపల్ టాక్స్, 50 శాతం దిగుమతి పన్ను అమలవుతూ ఉంటుంది. దీంతో మామూలుగానే అక్కడ మద్యం ఖరీదు చాలా ఎక్కువ. ప్రభుత్వ ఖజానాకూ భారీగా ఆదాయం సమకూరుతుంది. అందువల్లే దుబాయ్ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు