పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా... గర్హ్ శంకర్ పట్టణం. అక్కడ రహదారి పక్కన టార్పాలిన్ టెంటు వేసుకుని ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ప్రాంతంలో టెంట్లు, గుడిసెల్లో నివసించే వారు కనిపిస్తూనే ఉన్నప్పటికీ, ఈ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. అది కుటుంబ పెద్ద శింగార రాం షహుంగ్రా రెండు సార్లు ఎమ్మెల్యే కావడమే. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ధనిక రాష్ట్రంగా పేరున్న పంజాబ్ లో రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కనీసం ఓ ఇల్లు సంపాదించుకోలేకపోయిన ఏకైక వ్యక్తని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
గత వారంలో ఆయన ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ ను పంజాబ్ సర్కారు ఖాళీ చేయించింది. ఆయన అందులో అక్రమంగా ఉంటున్నాడన్నది ప్రభుత్వ వాదన కాగా, నిలువ నీడలేని ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. "మాజీ ఎమ్మెల్యేగా నాకు కేవలం రూ. 20 వేలు పెన్షన్ వస్తోంది. ఓ అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను. అప్పటి వరకూ మాకు ఆకాశమే పైకప్పు" అని శింగార రాం వ్యాఖ్యానించారు.
దివంగత బీఎస్పీ మహానేత కాన్షీరాం ఆఖరి రోజుల్లో ఆయన వెంట ఉన్నానన్న కారణంతో తనను బీఎస్పీ నుంచి వెలేశారని చెప్పుకొచ్చారు. కోర్టు ఆర్డర్ ఉందని చెబుతూ, పోలీసులు బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించారని, నిమ్న కులాల అభ్యున్నతికి కృషి చేయడమే తన తప్పయిపోయిందని, ఏనాడూ తాను డబ్బు సంపాదించాలని భావించలేదని, అదే నేటి తన స్థితికి కారణమని ఆయన వాపోయారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు