సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, 1986, జూన్ 22న మెక్సికో నగరంలోని అజ్టెకా స్టేడియం. వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్న వేళ. అర్జెంటీనా, ఇంగ్లండ్ ల మధ్య పోటీ జరుగుతోంది. దాదాపు 1.15 లక్షల మంది అభిమానులు ఉత్కంఠగా చూస్తున్న వేళ, ఓ గోల్ డిగో మారడోనాను వరల్డ్ స్టార్ గా చేసింది. అదే 'హ్యాండ్ ఆఫ్ గాడ్' (దైవ హస్తం) గోల్. ఓ ఆటగాడు పాస్ చేసిన బంతిని డిగో మారడోనా గోల్ లోకి పంపాడు. అతను తలతో బంతిని తాకుతున్నట్టు ఓ వైపు నుంచి, నిబంధనలకు విరుద్ధంగా చేతితో బంతిని నెడుతున్నట్టు మరో వైపు నుంచి కనిపిస్తున్న వీడియో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉంది. దీనిపై బ్రిటన్ ఆటగాళ్లు అప్పట్లో ఎంత గగ్గోలు పెట్టినా రిఫరీలు గోల్ చేసినట్టే ప్రకటించారు.
"వాస్తవానికి గోల్ ఇవ్వరని నాకు అనిపించింది. ఎందుకంటే నన్ను అభినందించేందుకు ఆటగాళ్లు ఎవరూ ముందుకు రాలేదు. వచ్చి నన్ను కౌగిలించుకోండి అని వారిని కోరాల్సి వచ్చింది. లేకుంటే రిఫరీ గోల్ ను ఇవ్వరని భావించాను. బంతి నా తలకు తగిలిందో, చేతికి తగిలిందో నాకే తెలియదు" అని మారడోనా వ్యాఖ్యానించాడు. ఒకవేళ నా చెయ్యే తగిలుంటే అది 'హ్యాండ్ ఆఫ్ గాడ్' మాత్రమే అని చెప్పాడు. ఆపై మారడోనా గోల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైంది కూడా. ఆ మ్యాచ్ లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. తన జీవితంపై మారడోనా రాసుకున్న స్వీయ చరిత్ర నుంచి ఫుట్ బాల్ పై రచించిన ఎన్నో పుస్తకాల్లో ఈ గోల్ గురించిన చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు