ఫిలింనగర్ దైవ సన్నిధానానికి పన్నెండేళ్లు!... మహాకుంభాభిషేకానికి కేసీఆర్, క్యూ కట్టిన సినీ ప్రముఖులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిలింనగర్ దైవ సన్నిధానానికి పన్నెండేళ్లు!... మహాకుంభాభిషేకానికి కేసీఆర్, క్యూ కట్టిన సినీ ప్రముఖులు

హైదరాబాదులోని ఫిలింనగర్ లో వెలసిన దైవ సన్నిధానానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ నేడు మహా కుంభాభిషేకానికి భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సినీరంగ ప్రముఖులంతా క్యూ కట్టారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ లతో పాటు పలువురు ప్రముఖులు ఆలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఆలయానికి రానున్నారు.

More Telugu News