ప్రపంచ దేశాలన్నీ వద్దు వద్దంటున్నా వినని ఉత్తర కొరియా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. సొంత టెక్నాలజీతో నిర్మించిన ముసుదాన్ క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశం నేటి ఉదయం దిగ్విజయంగా ముగించింది. నేటి ఉదయం సరిగ్గా 6 గంటలకు ప్రయోగించిన తొలి ముసుదాన్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. అయితే రెండు గంటల తర్వాత (నేటి ఉదయం 8 గంటలకు) ప్రయోగించిన ముసుదాన్ నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. దీంతో ఉత్తర కొరియా విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.
ముసుదాన్ పేరిట ఉత్తర కొరియా రూపొందించిన మధ్యంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించేందుకు ఆ దేశం ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు యత్నించి విఫలమైంది. ఈ ప్రయోగాలపై ప్రచంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆ దేశం పట్టించుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ దేశం ముసుదాన్ ను నేటి ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం విజయవంతమైన వెంటనే పొరుగు దేశం దక్షిణ కొరియాతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఘాటుగా స్పందించింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు