బ్రస్సెల్స్ లో బెల్టు బాంబు ఉగ్రవాది కలకలం...షాపింగ్ మాల్ దగ్గర అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రస్సెల్స్ లో బెల్టు బాంబు ఉగ్రవాది కలకలం...షాపింగ్ మాల్ దగ్గర అరెస్ట్

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మానవ బాంబు కలకలం రేపింది. 22 మార్చి 2016 తెల్లవారు జామున నెత్తురోడిన ఘటనను ఇంకా మరువని బ్రస్సెల్స్ నడిబొడ్డున తీవ్రవాదిని అదుపులోకి తీసుకోవడంతో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. సిటీ 2 అనే భారీ రిటెయిల్ షాపింగ్ మాల్ వద్ద తీవ్రవాదులను ఏరివేసే అపరేషన్ లో బిజీగా ఉన్న పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతడి వ్యవహారం గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అతని నడుం చుట్టూ బెల్టుబాంబు ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రధాని చార్లెస్ మైఖెల్ మాట్లాడుతూ, ఇది అంత తేలిగ్గా తీసిపారేసే వ్యవహారం కాదని అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు. అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News