సర్వం ‘యోగా’ మయం!... విశ్వవ్యాప్తంగా యోగాడేకు భారీ ఏర్పాట్లు
నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం యోగ నిద్రలోకి వెళుతోంది. ఈ మేరకు ఎక్కడికక్కడ ఐక్యరాజ్యసమితితో పాటు ఆయా దేశాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక యోగాకు పుట్టినిల్లైన భారత్ లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగాభ్యాసనాలు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది.
ఛండీగఢ్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా యోగాసనాలు వేయనున్నారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తున్న యోగాసనాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో కలిసి యోగాసనాలు వేయనున్నారు. ఆయా రాష్ట్రాలన్నింటిలోనూ యోగా సందడి మొదలైంది.