హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేసిన బరీందర్ శ్రాన్ రెండు రికార్డులు సమం చేశాడు. భారత పేస్ బౌలర్ బరిందర్ శ్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు తీయడం ద్వారా గతంలో టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రం సందర్భంగా నమోదు చేసిన నాలుగు వికెట్ల రికార్డును సవరించాడు.
2009లో బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఓజా 21 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు తీశాడు. శ్రాన్ మాత్రం కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. అలాగే టీ20 అరంగేట్ర బౌలర్ గా 2012లో ఐర్లాండ్ తో జరిగిన టీ20లో బంగ్లా బౌలర్ ఎలియస్ సన్నీ ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, అతని తరువాతి స్థానంలో శ్రాన్ నిలిచాడు. అదే ఏడాది అశోక్ దిండా శ్రీలంకతో జరిగిన టీ20 లో ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా దీనిని కూడా శ్రాన్ సమం చేశాడు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు