ఉప ఖజానా సొమ్మును బంధువుల ఖాతాలోకి మళ్లించిన ఉద్యోగి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉప ఖజానా సొమ్మును బంధువుల ఖాతాలోకి మళ్లించిన ఉద్యోగి

గుంటూరు జిల్లా తెనాలి ఉపఖజానా కార్యాలయం ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఉపఖజానా సొమ్ము రూ.20 లక్షలను తన బంధువుల ఖాతాల్లోకి మళ్లించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది. కార్యాలయం తనిఖీల్లో భాగంగా ఉన్నతాధికారులు తెనాలి ఉపఖజానా కార్యాలయానికి వెళ్లారు. వరుణ్ బాబు అనే ఉద్యోగి ఈ సొమ్మును తన బంధువుల ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఈ తనిఖీల్లో వెలుగుచూసింది. కార్యాలయ సిబ్బంది ఈ మేరకు తెనాలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More Telugu News