రుతు పవనాలు వచ్చేశాయి!... ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేనట!
ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు... అన్న చందంగా సాగిన రుతు పవనాలు ఎట్టకేలకు తెలుగు నేలను తాకాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీలోనూ విస్తరిస్తున్నాయి. ఈ ఫలితంగా నిన్ననే తెలుగు నేలపై చల్లని వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల్లో సాగు జోరందుకోనుంది.