వాక్చాతుర్యం, భాషపై పట్టు ఉంటే ఎందులోనైనా రాణిస్తాం: బండారు దత్తాత్రేయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాక్చాతుర్యం, భాషపై పట్టు ఉంటే ఎందులోనైనా రాణిస్తాం: బండారు దత్తాత్రేయ

విద్యార్హతల కంటే కూడా వాక్చాతుర్యం, భాషలో పట్టు ఉన్నవారు ఎందులో అయినా రాణిస్తారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నైపుణ్యత పెంపుదల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో 50 కోట్ల మంది పని సామర్థ్యం కలిగిన వారున్నా, అందులో కేవలం 5 శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగిన వారున్నారని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని, జపాన్ లో 75 శాతం, దక్షిణ కొరియాలో 90 శాతం, చైనాలో వంద శాతం మంది నైపుణ్యత కలిగిన వారున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు.

More Telugu News