వారు ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి పెరిగారు. పెద్దయ్యారు. అయినా ఏనాడూ స్నేహాన్ని వీడలేదు. జీవితంలో బిజీగా ఉన్నా తరచూ కలుసుకునేవారు. కుటుంబాల మధ్య అనుబంధాలు పెనవేసుకుపోయాయి. విశేషం ఏంటంటే, బాల్య స్నేహితులైన ఈ ముగ్గురూ ఒకేసారి వందేళ్ల బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం!
బార్నెస్, బట్లర్, అండర్వుడ్, రూత్.. బాల్య స్నేహితులు. నైరుతి వాషింగ్టన్లో వీరు నలుగురు కలిసి తిరిగారు. ఆడిపాడారు. జియాన్ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేవారు. జులై 1916లో జన్మించిన వీరిలో ముగ్గురు 1933లో ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చారు. 1968లో అమెరికాలో చెలరేగిన జాత్యహంకార గొడవలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. చూస్తుండగానే వందేళ్లు గడిచిపోయాయి.
అయితే మరో స్నేహితురాలు బార్నెస్ కూడా వందేళ్ల ఉత్సవంలో పాల్గొనాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ మేలో ఆమె చనిపోయింది. శనివారం జియాన్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన వందేళ్ల జన్మదిన వేడుకల్లో స్నేహితురాళ్లు ముగ్గురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు బార్నెస్ నిలువెత్తు ఫొటో ముందు అంజలి ఘటించారు. బార్నెస్ తమ ముందు లేకపోవడం చాలా బాధగా ఉందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ మేయర్ ఓప్రా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వీరికి ఓ వీడియోను పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేళ్లు జీవించడం అరుదే అయినప్పటికీ ముగ్గురు బాల్య స్నేహితులు ఒకేసారి వందేళ్లకు చేరుకోవడంతోపాటు ఉల్లాసంగా ఆ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేయడం మాత్రం మరింత అరుదనే చెప్పాలి.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు