బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ కాలేజ్ టీచర్(24)పై యాసిడ్ దాడికి పాల్పడిన దారుణ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ మీద పడడంతో 30 శాతం గాయాలైన ఆమె పై దుస్తులు తొలగించి సాయం కోసం ఏడుస్తూ దాదాపు కిలోమీటరు దూరం పరిగెత్తింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన బాధితురాలు ఇటీవలే ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజ్‌లో లెక్చరర్ గా చేరింది. దగ్గరల్లోని బస్టాప్‌కు ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మాస్క్‌లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ గుమ్మరించారు.
ఒక్కసారిగా యాసిడ్ మీద పడడంతో బాధతో అరుస్తూ అర్ధనగ్నంగా పరిగెడుతున్న ఆమెను ఓ వృద్ధురాలు గుర్తించి దుప్పటి ఇచ్చి కాపాడింది. అనంతరం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. దుండగులు ఆమెకు తెలిసిన వ్యక్తులేనని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం వారెవరో తనకు తెలియదని చెబుతోంది. దాడికి ముందు దుండగులు ఆ ప్రాంతంలో తచ్చాడినట్టు తెలుస్తోంది. బాధితురాలి మొబైల్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొందరు యువకులు ఆమెను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని, రెండు నెలల క్రితం ఆమె ఫోన్, బ్యాగును దొంగిలించినట్టు టీచర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు