నిజమే... దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న సామెత ఏపీ నిరుద్యోగులకు ఇట్టే సరిపోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ లో ఒకేసారి 10 వేల పై చిలుకు సర్కారీ ఉద్యోగాల భర్తీకి నారా చంద్రబాబునాయుడు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సదరు పోస్టుల భర్తీకి నిన్న ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. వెనువెంటనే భర్తీ ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ జారీ అయ్యేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుందని ఎపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ కొద్దిసేపటి క్రితం చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పటికే ఏళ్ల తరబడి సర్కారీ ఉద్యోగాల నియామకం నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక షాక్ అనే చెప్పచ్చు.
అయితే వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఉదయ భాస్కర్ చేసిన వాదనలోనూ నిజముందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటిదాకా ఉన్న ఉమ్మడి రాష్ట్ర సర్వీస్ కమిషన్ రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో సింగిల్ సభ్యుడు మాత్రమే ప్రస్తుతం ఏపీపీఎస్సీలో ఉన్నారు. ఇక ఇటీవలే ఉదయ భాస్కర్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అయితే మొత్తం 9 మంది సభ్యులుండాల్సిన కమిషన్ లో ఒక్క సభ్యుడితో వేగంగా చర్యలు చేపట్టడం సాధ్యం కాదని ఉదయ భాస్కర్ చెప్పారు. కనీసం మరో ఇద్దరు, ముగ్గురు సభ్యులు అందుబాటులోకి వస్తే తప్పించి ఉద్యోగ నియామకాల్లో వేగాన్ని పెంచలేమని ఆయన చెప్పుకొచ్చారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు