గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ కేబినెట్లో రవాణా శాఖతో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను భుజాన వేసుకున్న శంకర్ చౌదరి ఎంబీఏ దాకా విద్యనభ్యసించారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో దాఖలు చేసే అఫిడవిట్ లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి తన విద్యార్హతలను వెల్లడించారు. అయితే ఇటీవల ఆయన తన రాష్ట్రంలోని ఓ పాఠశాలకు వెళ్లారు. మంత్రిగా ఉన్న ఆయన టీచర్ అవతారం ఎత్తారు. పుస్తకం చేతబట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పారు. చేతిలో చాక్ పీసు పట్టి బోర్డుపై ఆంగ్లంలో ఆయా పదాలకు స్పెల్లింగ్ లు కూడా రాశారు.
ఈ సందర్భంగా ‘ఏనుగు’ను ఆంగ్లంలో ఏమని పిలుస్తారంటూ ‘ఎలిఫెంట్’ అనే పదాన్ని బోర్డుపై రాశారు. అయితే ఆ పదంలోని ఆరో అక్షరం ‘ఏ’కు బదులు ఆయన ‘ఈ’ అని రాశారు. దీనిని గమనించిన ఓ విద్యార్థి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పుగా రాశారని చెప్పి మంత్రిగారికి షాకిచ్చారు. ఈ వ్యవహారం మొత్తం తమ కళ్ల ముందు జరుగుతున్న నేపథ్యంలో మీడియా కూడా పూర్తిగా రికార్డు చేసి ప్రసారం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. దీంతో దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు