హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కవిత... ప్రొఫెషనల్ రెజ్లర్ కాదు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో గతంలో అనుభవం మాత్రమే ఉంది. హర్యానా పోలీస్ శాఖలో చేరిన తర్వాత దానికి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగానికీ కూడా ఆమె రాజీనామా చేశారు. అయితేనేం... ఆమెలోని యోధురాలు మాత్రం నిద్ర పోలేదు. ఇటీవల ఢిల్లీలో ‘గ్రేట్ కాళీ’ ఆధ్వర్యంలో ‘కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ పేరిట జరిగిన ప్రొఫెషనల్ రెజ్లింగ్ పోటీల్లో భారత ప్రప్రథమ మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ ను సింగిల్ దెబ్బకు మట్టి కరిపించారు. రెజ్లింగ్ పోటీలను చూద్దామంటూ ఉత్సాహంగా వచ్చిన కవిత... సాధారణ మహిళలు వేసుకునే పంజాబీ (సల్వార్- కమీజ్) డ్రెస్ లోనే అక్కడికి వెళ్లారు. బుల్ బుల్ సవాల్ తో కవితలోని యోధురాలు కాస్తంత ఆవేశానికి లోనయ్యారు. ముందూ వెనుకా చూడకుండా రింగ్ లోకి దూకేశారు.
సవాళ్లు, ప్రతి సవాళ్ల తర్వాత తనపై ఓ పంచ్ విసిరిన బుల్ బుల్ ను... కవిత సింగిల్ దెబ్బతో కింద పడేశారు. అంతే, ప్రొఫెషనల్ రెజ్లర్ తేరుకోలేకపోయింది. రెజ్లర్ ను కిందపడేసిన కవిత... అచ్చమైన ఫ్రొఫెషనల్ మాదిరే పంచ్ లు విసిరారు. దీంతో షాక్ తిన్న నిర్వాహకులు నలుగురు యువకులను రింగ్ లోకి పంపి కవితను నిలువరించారు. అయితే మరోమారు బుల్ బుల్ సవాల్ చేయడంతో రెండో దఫా కూడా కవిత తన పంచ్ పవర్ చూపించారు. రెండో మారు కూడా మొదటి పంచ్ తరహాలోనే కవిత విరుచుకుపడటంతో బుల్ బుల్ కిందపడిపోయింది. ఆ తర్వాత కూడా కవితను నిలువరించడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు యువకులు కవితను నిలువరించి కిందకు పంపారు. ఈ వీడియో ప్రస్తుతం జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు