శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు మిస్టరీ ఛేదించారు. ఈ నెల 14న విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని, పుష్పక్ బస్సు ఎక్కి బోయిన్ పల్లి వరకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ఖైరవీ శర్మ (17) ఆచూకీని కనిపెట్టేశారు. విశాఖ నుంచి పుణె వెళ్తూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. ఆమె పూణే చేరుకోలేదన్న వార్తతో తండ్రి ఆమె ఆచూకీ ఆరాతీయగా శంషాబాద్ లో దిగినట్టు తెలిసింది. దీంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టడంతో ఎయిర్ పోర్టు బయట పుష్పక్ బస్సు ఎక్కినట్టు గుర్తించారు.
దీంతో ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేయగా, బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో ఆమె స్నేహితులు, ప్రయాణికులు, ఫేస్ బుక్ స్నేహితులు... ఇలా అందర్నీ విచారిస్తూ పోలీసులు ముందుకి సాగడంతో ఆమె ఎక్కడుందో తెలిసింది. ఖైరవీ శర్మ గోవా బీచ్ లో పోలీసులకి దొరికింది. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు, ఆమె తండ్రి, నేవీ అధికారి అరవింద్ కుమార్ కు అప్పగించారు. దీనిపై ఇతర వివరాలేవీ శంషాబాదు పోలీసులు వెల్లడించకపోవడం విశేషం.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు