ప‌ల్లంరాజు నివాసంలో ముద్ర‌గ‌డ దీక్ష‌పై కాపు సంఘాల భేటీ.. కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌ల్లంరాజు నివాసంలో ముద్ర‌గ‌డ దీక్ష‌పై కాపు సంఘాల భేటీ.. కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం

హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు నివాసంలో కాపు సంఘాల నేతలు స‌మావేశమ‌య్యారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స‌మావేశానికి కేంద్ర మాజీ మంత్రులు దాస‌రి నారాయ‌ణ‌రావు, చిరంజీవి, వైసీపీ నేత‌లు బొత్స స‌త్యనారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబుతో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలని కోరుతున్న‌ట్లు మీడియాతో అన్నారు. ముద్ర‌గ‌డ దీక్షను హేళ‌న చేస్తున్నార‌ని కాపు నేత‌లు అన్నారు.

More Telugu News