జ‌మ్మూ రూప్ నగర్‌లో రెండు రోజుల క్రితం ఓ వ్య‌క్తి అక్క‌డి ఓ పురాత‌న ఆల‌యాన్ని ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌తో చెల‌రేగిన ఉద్రిక్త‌ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌క‌ముందే తాజాగా మ‌రోసారి అటువంటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్క‌డి నాన‌క్ న‌గ‌ర్‌లోని ఓ ఆల‌య ధ్వంసానికి ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించ‌డం తీవ్ర అల‌జ‌డి సృష్టించింది. ఆల‌యంలోకి వెళ్లిన‌ ఓ వ్య‌క్తి దాన్ని ధ్వంసం చేయ‌బోయాడు. పోలీసులు వెంట‌నే ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆల‌యం ధ్వంసం చేసే ప్ర‌యత్నం జ‌రిగింద‌న్న స‌మాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్య‌లో నిర‌స‌న‌కు దిగారు. రోడ్ల‌పైకి వచ్చిన ప్రజలు ఆందోళ‌న చేబట్టారు. దాంతో పోలీసులు ప‌రిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. జ‌మ్మూ రూప్ నగర్‌లో జ‌రిగిన ఆల‌య ధ్వంసానికి, తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీంతో జ‌మ్మూలో మ‌రోసారి మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను బంద్ చేశారు.