శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ నెల 14న అదృశ్యమైన నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ (17) ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేక పోయారు. విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. ఆమె ఎటువెళ్లిందన్న విషయమై ఇంతవరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వాస్తవానికి కనెక్టింగ్ విమానం ఎక్కేవారెవరూ విమానాశ్రయం బయటకు వెళ్లరు.
కానీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ చేరుకున్న ఆమె, బయటకు వచ్చి ఓ పుష్పక్ బస్సు ఎక్కినట్టు గుర్తించిన పోలీసులు, ఆపై ఆమె సెల్ ఫోన్ బోయినపల్లి వరకూ వెళ్లినట్టు మాత్రమే గుర్తించారు. ఆపై సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, ట్రేసింగ్ కష్టమైపోయింది. ఖైరవీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినా, ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక తనంతట తానే ఎటైనా వెళ్లిందా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం చిక్కలేదు. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు