మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీపై వాట్స్ యాప్ లో పెట్టిన ఓ ఫోటో, మెసేజ్ ఒకరి ప్రాణం తీయగా, ఆరుగుర్ని గాయపరిచింది. జబల్పూర్ సిటీ ఏరియా ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ చెప్పిన వివరాల ప్రకారం... విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ 'విజయ నగర్ ఫ్రెండ్స్' పేరిట వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్లున్న ఓ అభ్యంతరకర వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేసి, 'సోనియా ఈ దుస్థితికి రావడానికి మోదీ కారణం' అన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యను జత చేశాడు.
దీంతో జతిన్ రాజ్ కు కోపం వచ్చింది. దీనిపై గత రాత్రి అహింసా చౌక్ లో వీరు తమ అనుచరులతో కలుసుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు, ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిచారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇరు వర్గాలు అక్కడ కూడా వాదులాటకు దిగాయి. ఇది తీవ్ర రూపం దాల్చడంతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒక వ్యక్తి హత్యకు గురికాగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
అయితే, ఈ ఘటన స్టేషన్ బయట జరిగిందని ఎస్పీ చెప్పారు. 'కాదు స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే జరిగింద'ని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని బాధితులు పేర్కొంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు