భారత్ లోని ప్రతి పది మొబైల్ సెర్చ్ లలో ఒకటి సినిమా గురించే!: గూగుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ లోని ప్రతి పది మొబైల్ సెర్చ్ లలో ఒకటి సినిమా గురించే!: గూగుల్

భారత్ లోని ప్రతి పది మొబైల్ సెర్చ్ ఆపరేషన్లలో ఒకటి సినిమాకు సంబంధించే ఉంటోందని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తెలిపింది. అందుకే, బాలీవుడ్, టాలీవుడ్ కు సంబంధించి సెర్చ్ చేసే అంశాలపై వీడియో లింక్స్, స్క్రీన్ టైమింగ్స్ తదితర సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో గూగుల్ ఉందని తెలుస్తోంది. నటీ నటులు, సంగీతం, డైలాగ్స్ ఇలా ఏ అంశాన్నైనా అభిమానులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామని గూగుల్ వెల్లడించింది. సినిమాలకు సంబంధించిన సమాచారం అధికంగా అడుగుతుండడంతో ఈ దిశగా సమాచారం అందించేందుకు తాము ప్రయత్నాలు ప్రారంభించామని గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ స్వప్న చద్దా తెలిపారు.

More Telugu News