తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో మహిళలు ఆందోళనకు దిగారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తోన్న నిరశనకు మద్దతుగా భారీ సంఖ్యలో మహిళలు అక్కడి రహదారిపైకి చేరుకొని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ నేత ముద్ర‌గ‌డ ప్ర‌భుత్వం ముందుంచుతోన్న డిమాండ్లను వెంట‌నే అమ‌లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.