కారు డ్రైవర్ మాట దురుసుతనం కారణంగా ఓ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంఘటన ఇది. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'రెక్క' సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరువయ్యూరులోని పంచనందీశ్వరాలయంలో జరుగుతోంది. సినిమాలో ప్రధానంగా వచ్చే భారీ సన్నివేశాలను తీస్తుండడంతో వాహనాలను కూడా అంతే స్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో స్థానికులు తమ ఇళ్లలోకి వెళ్లలేని విధంగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఆ సమయంలో ఓ స్థానికుడు తన ఇంటికి అడ్డంగా నిలిపి ఉంచిన వాహానాన్ని తీస్తే ఇంట్లోకి వెళ్తానని అడగడంతో, సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఓ వ్యాన్ డ్రైవర్ పెడసరంగా సమాధానం చెప్పాడు.
దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యాన్ డ్రైవర్ నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడాడు. దీంతో స్థానికులు గుమికూడి అతనితో వాగ్వాదానికి దిగారు. స్థానికులు ఎక్కువ మంది రావడం గమనించిన వ్యాన్ డ్రైవర్ మెల్లిగా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ఆ సినిమా షూటింగ్ కారణంగా తామంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, షూటింగ్ ఆపేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వ్యాన్ డ్రైవర్ ను అరెస్టు చేస్తామని, షూటింగ్ నిలిపేసేలా చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు