నాదే తప్పు... మీకో నమస్కారం: జేసీ దివాకర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాదే తప్పు... మీకో నమస్కారం: జేసీ దివాకర్ రెడ్డి

"ప్రజల కష్టాలు తీర్చాలని అనుకున్నాను. నాదే తప్పు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకో నమస్కారం" అంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురం కార్పొరేషన్ సమావేశం సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకోగా, ఇద్దరు నేతలూ గట్టిగా కేకలు పెట్టుకున్నారు. బ్రిడ్జ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమవుతుంటే, ఎంపీ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. అసలా సాంకేతిక సమస్యలే మీ వల్ల వచ్చాయంటూ విరుచుకుపడ్డ జేసీ, ప్రజలకు మేలు కలగాలని కోరుకోవడం తన తప్పయిపోయిందని అన్నారు.

More Telugu News