30 మంది యువతులను మోసం చేసిన ముంబై, పూణే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

30 మంది యువతులను మోసం చేసిన ముంబై, పూణే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

ముంబై, పూణే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు పట్టుకున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు లక్ష్యంగా మహిళలను మోసం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారినని నమ్మిస్తూ రాహుల్ సిన్హా అనే వ్యక్తి సుమారు 30 మంది యువతులను మోసం చేశాడు. వీరి నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇంత వరకు రాహుల్ సిన్హా చేతిలో మోసపోయిన మహిళలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లని వారు తెలిపారు. విద్యావంతులైన యువతులు మోసపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News