భారత ఉద్యోగులకు ఏం కావాలి? వారేం కోరుకుంటున్నారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ సంస్థ అడోబ్, 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' పేరిట ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమకు ఉద్యోగం నచ్చితే జీతం తక్కువైనా చేస్తామని, పెద్దమొత్తంలో డబ్బులు ఒకేసారి వచ్చి పడేలా లాటరీ తగిలినా చేస్తున్న జాబ్ వదలబోమని 98 శాతం మంది వెల్లడించడం గమనార్హం. ఇక ఇండియాలో ఉద్యోగం చేస్తున్న వారిలో 83 శాతం మంది తమ పనిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు, తమ జీవనం మరింత ఆనందంగా సాగాలని కోరుతూ, అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండు ఉద్యోగాలు చేయడమన్న విషయం సాధారణమైపోతుందని 68 శాతం మంది తెలిపారు.
పనిచేస్తున్న చోట ఆనందకరమైన అంశాలేమని ప్రశ్నించగా, అత్యాధునిక టెక్నాలజీని వాడుతుండటమేనని 89 శాతం మంది, ఆహార పానీయాలు అందుబాటులో ఉండటమని 87 శాతం మంది, కార్యాలయ భవనం సౌకర్యవంతంగా ఉండటమని 86 శాతం మంది వెల్లడించారు. మరో రెండు దశాబ్దాల్లో 60 శాతానికి పైగా పనులు టెక్నాలజీ సాయంతోనే నడుస్తాయని అభిప్రాయపడ్డారు. మెరుగైన అవకాశం వస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తామని 68 శాతం మంది పేర్కొనడం గమనార్హం.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు