తుని ఘ‌ట‌న‌లో నిందితుల‌ని విడుద‌ల చేయ‌మ‌న‌డం స‌రికాదు.. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి: గ‌ంటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుని ఘ‌ట‌న‌లో నిందితుల‌ని విడుద‌ల చేయ‌మ‌న‌డం స‌రికాదు.. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి: గ‌ంటా

కాపునేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తుండ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాసరావు మ‌రోసారి స్పందించారు. ఈరోజు విశాఖప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాపుల సంక్షేమానికి తమ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తుని స‌భ‌లో విధ్వంసం సృష్టించిన వారిని విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేయ‌డం భావ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. నిందితుల‌ను పోలీసులు నాలుగు నెల‌లుగా క‌ష్ట‌ప‌డి గుర్తించార‌ని అన్నారు. నిందితుల‌ని పూర్తి ఆధారాల‌తో అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాపుల అంశాన్ని రాజ‌కీయం చేయ‌కుండా ముద్ర‌గ‌డ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌డానికే తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

More Telugu News