240 ఎస్కార్ట్ సేవల వెబ్ సైట్లపై నిషేధం... తక్షణం అమలు చేయాలని ఐటీ శాఖ ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

240 ఎస్కార్ట్ సేవల వెబ్ సైట్లపై నిషేధం... తక్షణం అమలు చేయాలని ఐటీ శాఖ ఆదేశం

ఎస్కార్ట్ సేవల పేరిట వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ, విటులకు, సెక్స్ వర్కర్లకు మధ్య వారధిగా పనిచేస్తున్న 240 వెబ్ సైట్లపై తక్షణం నిషేధాన్ని అమలు చేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ లో అశ్లీలతను, అసభ్యతను తొలగించే చర్యల్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2009 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఎస్కార్ట్స్ సేవలందిస్తున్న పీంకీ సింగ్ డాట్ కామ్, జాస్మిన్ ఎస్కార్ట్స్ డాట్ కామ్, పాయల్ మల్ హోత్రా డాట్ ఇన్, లోకల్ ఎస్కార్ట్స్ డాట్ ఇన్, పెరల్ పటేల్ డాట్ ఇన్, కావ్యా జైన్ డాట్ ఇన్, ఎక్స్ ముంబై డాట్ ఇన్, షిమీ డాట్ ఇన్, అన్చూ డాట్ ఇన్ తదితర వెబ్ సైట్ల పేర్లు ఉదహరిస్తూ, మొత్తం 240 వెబ్ సైట్లను నిలిపివేయాలని ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్)లకు ఐటీ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా, ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ మాధ్యమంగా జరిపే వ్యభిచారాన్ని ఎంతమాత్రమూ అడ్డుకోలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఎస్కార్ట్స్ పేరిట మాత్రమే కాకుండా, మసాజ్, బ్యూటీ, పర్సనల్ సర్వీసెస్, ఉమెన్ లుకింగ్ మెన్, కాజువల్ ఎన్ కౌంటర్ వంటి ఎన్నో పేర్లతో వందలాది వెబ్ సైట్లలో ఉన్న ఈ తరహా కంటెంట్ ను తొలగించడం అంత సులువేమీ కాదని నిపుణులంటున్నారు.

More Telugu News