డ్రైవింగ్ లైసెన్సుల నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు రాష్ట్రాల రవాణా మంత్రులతో కూడిన కమిటీ అభిప్రాయపడింది. చిన్నారులు వాహనాలు నడుపుతుండటం, తమ విద్యావసరాల నిమిత్తం ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న నేపథ్యంలో, 16 సంవత్సరాలు దాటిన వారికి లైసెన్స్ లు మంజూరు చేసేలా సవరణలు చేయాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది. వీరికి గేర్లు లేని స్కూటీ తరహా వాహనాలను నడిపేందుకు అనుమతి ఇవ్వచ్చని సిఫార్సు చేసింది.
రోడ్డు రవాణా, భద్రత, సౌకర్యాల మెరుగు వంటి విషయాలపై ఈ బృందం తన నివేదికను కేంద్రానికి అందించగా, అందులో 16 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్ సిఫార్సు కూడా ఉంది. రాజస్థాన్ రవాణా మంత్రి యూనస్ ఖాన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 16 ఏళ్లు దాటిన వారికి 100 సీసీ కన్నా మించని వాహనాలను నడిపేందుకు అనుమతించవచ్చని పేర్కొంది. ఇంకా ఆర్టీసీని బలోపేతం చేసేందుకు పన్నులను మినహాయించాలని, డ్రైవర్లకు డ్రస్ కోడ్ తీసివేయాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఉన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు