ధోనీ 'కిట్' లక్ష, లియాండర్ పేస్ 'రాకెట్' లక్షన్నర పలికాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ 'కిట్' లక్ష, లియాండర్ పేస్ 'రాకెట్' లక్షన్నర పలికాయి!

ధోనీ క్రికెట్ కిట్ కి లక్ష రూపాయలు, లియాండర్ పేస్ రాకెట్లకి లక్షన్నర పలికాయి. అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారులను ఆదుకునేందుకు నడుంబిగించిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ వెబ్‌సైట్‌ నిర్వహించిన వేలానికి తాము వినియోగించిన వస్తువులను వీరు ఇచ్చారు. ఈ వెబ్ సైట్ ధోనీ క్రికెట్ కిట్, లింయాడర్ పేస్ టెన్నిస్ రాకెట్ తో పాటు ఇతర విలువైన వస్తువులను వేలం వేసింది. ఈ వేలంలో మహేంద్రసింగ్‌ ధోని క్రికెట్ కిట్‌ లక్ష రూపాయలకు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన లియాండర్‌ పేస్‌ టెన్నిస్‌ రాకెట్‌ లక్షన్నరకు అమ్ముడయ్యాయి. పేస్‌ రాకెట్‌ ను టీమిండియా మాజీ ఆటగాడు, బెంగాల్‌ కెప్టెన్‌ మనోజ్‌ తివారి కొనుగోలు చేయగా, పీలే ఆటోగ్రాఫ్‌ చేసిన ఫుట్‌ బాల్‌ ను కోల్‌ కతాకు చెందిన నిర్మాత నమిత్‌ బజోరియా 1.10 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ వేలం సందర్భంగా సమకూరిన 14 లక్షల రూపాయలను కాలేయ కేన్సర్‌ తో బాధపడుతున్న ఫుట్‌ బాల్‌ క్లబ్‌ మోహన్‌ బగాన్‌ అభిమాని బాపీ మజ్‌ హి, కేన్సర్ తో బాధపడుతున్న అలిప్‌ చక్రబర్తి కుటుంబానికి ఇస్తామని తెలిపారు.

More Telugu News