విమానయాన సంస్థల ఆఫర్ సేల్ కొనసాగుతోంది. ఎయిరిండియా, స్పైస్ జెట్, విస్తారా ఎయిర్ లైన్స్ ఇలా ప్రతి విమానయాన సంస్థ ఆఫర్లతో ప్రయాణికులకు గాలమేస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఏషియా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సేల్’ ఆఫర్ ప్రకటించింది. అన్ని రుసుములతో కలిపి కేవలం 799 రూపాయలకే దేశీయ ప్రయాణం అందిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది. అయితే 2017 జనవరి 4 నుంచి 2017 ఆగస్టు 21లోపు ప్రయాణించాలనుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా తెలిపింది. ఈ ఆఫర్ లో ఈ నెల 19 వరకు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ఈ ఆఫర్ లో గువాహటి-ఇంఫాల్ మధ్య కేవలం 799 రూపాయలతో ప్రయాణించవచ్చని తెలిపింది.
బెంగళూరు-కొచ్చి మధ్య కేవలం 899 రూపాయలతో ప్రయాణించవచ్చని చెప్పింది. బెంగళూరు-పూనెల మధ్య కేవలం 1,099 రూపాయలకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఇక దిల్లీ-బెంగళూరు మధ్య కేవలం 2,699 రూపాయలతో వెళ్లవచ్చని చెప్పింది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య 1,199 రూపాయలతో ప్రయాణం చేయవచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఇక విదేశీ యానాన్ని కూడా సరసమైన ధరకే అందిస్తున్నట్టు ఎయిర్ ఏషియా వెల్లడించింది. కొచ్చి-కౌలాలంపూర్ మధ్య 3,399 రూపాయలకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు