కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న తల్లి ఆ పదకొండేళ్ల బాలిక పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి అమ్మేసింది. ఆపై కామాంధుల లైంగిక వేధింపులకు గురై తీరని బాధను అనుభవించింది. చివరికి తాను ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురి కావడంతో చిక్కుల్లో నుంచి బయటపడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లో నివసించే దంపతులకు ఓ కుమార్తె ఉంది. వీరి మధ్య విభేదాలు రావడంతో తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండగా, అతను కామాంధుడై కూతురి వరసైన బాలికను చెరబట్టాడు. కన్నతల్లికి చెబితే, బెదిరింపులే ఎదురయ్యాయి.
బాలికను వదిలించుకోవాలని భావించిన ఆమె, విజయవాడకు చెందిన మహిళకు విక్రయించగా, ఆపై ఆమె మంగళగిరికి చెందిన మహిళకు, ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె చీరాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న వాణి అనే యువతికి విక్రయించింది. వాణి ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టగా, ఓ హోంగార్డు, వాణి ప్రియుడు జితిన్ లాల్, మరికొందరు ఆమెపై అత్యాచారం చేశారు. గత వారంలో వాణి, బాలిక గుడికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకుని చిలకలూరిపేట చేరింది. అక్కడి స్థానికులు బాలిక పరిస్థితిని చూసి, పోలీసులకు సమాచారం ఇవ్వగా, చీరాల సీపీడీఓ నాగమణి ఆశ్రయమిచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు హోంగార్డును, జితిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు